- Advertisement -
HomeతెలంగాణAlumni Reunion | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Reunion | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని నాందేవ్​వాడ(namdevwada) రావూజీ వంజరి సంఘం ఉన్నత పాఠశాల (Ravuji Sangam) 1991 బ్యాచ్​ పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. నగర శివారులోని ఓ ఫంక్షన్​ హాల్​లో వారంతా ఒక్కచోట కలిశారు. అప్పటి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ముత్యంరెడ్డి, మల్లయ్య, సరళ, మోహన్, గంగాధర్, విజయకుమార్, రవి, సత్యం, తదితరులను ఘనంగా సన్మానించారు. తాము ఈ స్థాయిలో ఉండడానికి ఆనాడు గురువులు చెప్పిన విద్యాబుద్ధులే కారణమని వారు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పరమేశ్వర్, నరేష్, దయాకర్ గౌడ్, వినోద్, లక్ష్మీనారాయణ, వెంకట్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News