అక్షర టుడే, ఎల్లారెడ్డి: Summer camp | పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ZP Girls High School నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను summer camp విద్యార్థులు students సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజులు MEO Rajulu కోరారు. ఆదివారం సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 20 వరకు క్యాంప్ ఉంటుందని, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు students యోగా, డాన్స్, కంప్యూటర్, పెయింటింగ్ లలో శిక్షణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లింగమూర్తి , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
