అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Busstand | కామారెడ్డి జిల్లాకేంద్రంలోని kamareddy district ఆర్టీసీ బస్టాండ్ RTC bustand అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బస్టాండ్‌లోకి వెళ్లి వచ్చే దారుల్లో భారీగుంతలు ఏర్పడడంతో అందులో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్టాండ్‌లోకి వెళ్లి రావాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అధ్వానంగా ఉన్న బస్టాండ్ నుంచి బయటకు వెళ్లేదారి