అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. క్షత్రియ సమాజ్(Kshatriya Samaj), యువజన సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలు జరిపారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు.
కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ (State Executive Secretary of Kshatriya Regional Samaj), పండిత్ పవన్, కార్యదర్శులు పడాల్ గణేష్, సంజయ్ వైద్య, ఆర్మూర్ క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బారాడ్ గంగామోహన్, ఉపాధ్యక్షుడు కిషన్, సంయుక్త కార్యదర్శులు బాదాం రాజేందర్, సంతని విజయ్, బారాడ్ కిషోర్, సర్వసమాజ్ కార్యదర్శి కర్తన్ దినేష్, క్షత్రియ సమాజ్ మహిళా మండలి రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు సంగీతా ఖాందేష్, ఆర్మూర్ సమాజ్ మహిళా మండలి సభ్యులు డీజే సులోచన తదితరులున్నారు.