CBI | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన జీఎస్​టీ ఇన్​స్పెక్టర్​
CBI | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన జీఎస్​టీ ఇన్​స్పెక్టర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI | లంచం తీసుకుంటుండగా పట్టుబడిన జీఎస్​టీ GST ఇన్​స్పెక్టర్​ను సీబీఐ CBI అరెస్ట్​ చేసింది. ఉత్తరప్రదేశ్​లోని UP ప్రయాగ్​రాజ్​లో గల ప్రాంతీయ జీఎస్​టీ కార్యాలయంలోని ఇద్దరు ఇన్​స్పెక్టర్లు inspectors ఒకరిని లంచం అడిగారు. కంపెనీ ధ్రువీకరణ కోసం రూ.పది వేలు డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం రూ.పది వేలు లంచం తీసుకుంటుంగా ఓ ఇన్​స్పెక్టర్​ను సీబీఐ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.