Heavy Rains | ఆగం జేసిన వడగండ్ల వాన..
Heavy Rains | ఆగం జేసిన వడగండ్ల వాన..

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి/ఇందల్వాయి: Heavy Rains | ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని ఆగం జేసింది. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి(Yellareddy) ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

సుమారు గంటపాటు కురిసిన వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరద కాలువల్లో ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి ధాన్యం రక్షించుకోవడానికి ప్రయత్నించారు. లింగంపేట (Lingampet) మండలంలోని భవానీపేట (Bhavanipet), జల్దిపల్లి, రాంపూర్, తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Heavy Rains | ఆగం జేసిన వడగండ్ల వాన..
చిన్నమల్లారెడ్డిలో ధాన్యం కాపాడుకునేందుకు రైతన్న అవస్థలు

చిన్నమల్లారెడ్డిలో ధాన్యం కాపాడుకునేందుకు రైతన్న అవస్థలు

లింగంపేటలో ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షం నీరు

Heavy Rains |  ఇందల్వాయిలోని సిర్నాపల్లిలో..

ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఆదివారం వడగళ్ల వాన కురియడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రైతులు ధాన్యం కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు.

సిర్నాపల్లిలో ధాన్యం కుప్పల చుట్టూ నిలిచిన వర్షంనీరు