అక్షరటుడే, వెబ్‌డెస్క్: pawan kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ pawan kalyanకి ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు చూసేందుకు అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు.
సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమాలు Pawan Kalyan films సంవత్సరానికి ఒకటి అలా వచ్చేవి. ఇక ఇప్పుడు రాజకీయాలలోకి politics వచ్చే సరికి ఆ ఊసే లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు Harihara Veeramallu గత ఐదేళ్లుగా ప్రొడక్షన్ లోనే ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ shooting పూర్తి చేసుకుని రిలీజ్ కావల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతోంది.
pawan kalyan | ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్..
ఈ సినిమా కోసం ఎదురు చూసి చూసి అభిమానులే fans అంచనాలు తగ్గించేసుకున్నారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు Harihara Veeramallu గేరు మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు నుంచి జరగబోయే షెడ్యూల్ లో schedule పవన్ కళ్యాణ్ కు Pawan Kalyan సంబంధించిన బ్యాలన్స్ పార్ట్ పూర్తి చేయబోతున్నట్టు తెలిసింది.
ఈ నెల 7 లేదా 8 తేదీల వరకు జరిగే ఈ చిత్రీకరణని దర్శకుడు జ్యోతి కృష్ణ Director Jyothi Krishna పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. ఈ నెలాఖరు విడుదలకు ఉన్న సాధ్యాసాధ్యాలు గురించి నిర్మాత ఏఎం రత్నం am Ratnam తీవ్ర చర్చల్లో ఉన్నారట. విజయ్ దేవరకొండ Vijay Deverakonda కింగ్ డమ్ kingdom మే 30 లాక్ చేసుకున్న నేపథ్యంలో ఏ నిర్ణయమైనా వీలైనంత వేగంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారట.
పవన్ ఐదారు రోజుల కాల్షీట్స్ ఇస్తే మొత్తం షూటింగ్ shooting పూర్తయ్యే నేపథ్యంలో ఇవాళ నుంచి వారం రోజుల పాటూ పవన్ తన డేట్స్ ను అడ్జస్ట్ చేసి వీరమల్లు Harihara veeramallu షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు Pawan fans పండగనే చెప్పాలి. ఇప్పటికే మేకర్స్ మే 9న వీరమల్లును రిలీజ్ release చేయాలని భావించారు. కానీ మే 9న రిలీజ్ release ఎట్టి పరిస్థితుల్లో మూవీ రిలీజ్ కావడం కష్టం. మే 30న సినిమాను రిలీజ్ release చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సోషల్ మీడియాలో social media వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల్లో పవన్ షూట్ అయ్యిపోతే సినిమా మొత్తం కంప్లీట్ అయినట్టే అని చెప్పొచ్చు. అలాగే ఈ తర్వాత కొత్త డేట్ ని new date మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.