అక్షరటుడే, వెబ్‌డెస్క్: tomb of Sri Krishna Devaraya : దేశమే గర్వంగా చెప్పుకొనే గొప్ప చక్రవర్తుల్లో శ్రీ కృష్ణదేవరాయలు srikrishna devarayulu ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయిన గొప్ప రాజు. ఆయన మరణం తర్వాత అనెగొంది(Anegondi)లో సమాధి చేశారు.
తుంగభద్రా నది(Tungabhadra River) ఒడ్డున దేవరాయల devarayala సమాధి మండపం ఉంది. 64 పిల్లర్లతో ఈ మండపం అద్భుతంగా నిర్మించారు. ఈ 64 పిల్లర్లు కూడా చదరంగంలోని 64 గడులకు గుర్తులుగా చెబుతుంటారు. జీవితమే చదరంగంగా పేర్కొంటూ ఈ ఆయన సమాధిని నిర్మించారంటారు.
అంతటి గొప్ప మహానుబావుడి సమాధికి రక్షణ లేకుండా పోతోంది. కొంతమంది దుర్మార్గులు శ్రీ కృష్ణదేవరాయల సమాధిపై నీచమైన పని చేస్తున్నారు. సమాధినే జంతు వధశాలగా మార్చేశారు. సమాధిపై మేక కోయడం వివాదాస్పదంగా మారింది.
సమాధిపైనే మేక కోసి, మాంసం ముక్కలుగా మార్చడాన్ని ఎవరో సెల్‌ఫోన్ చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Vijayapura MLA Basanagouda Patil) ఈ ఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు దేశానికే గర్వకారణం.
అలాంటి ఆయన సమాధిని స్థానికులు మేకల మార్కెట్‌గా మార్చడం అత్యంత అవమానకరం. హిందూ దేవాలయాలను కూల్చిన ఔరంగజేబు(Aurangzeb) సమాధిని పురావస్తు శాఖ(Archaeological Department) రక్షిస్తోంది. కానీ, విజయనగర సామ్రాజ్యం కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన శ్రీ కృష్ణ దేవరాయల సమాధిని మాత్రం పట్టించుకోకపోవడం దారుణం’ అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.
Meat being sold at the tomb of Shri Krishnadevaraya- South India’s pride🔥🚩
Turning the samadhi of a legendary Hindu emperor into a mutton market..? This is disgraceful😑
CC :- @HKPatilINC @PriyankKharge @ASIGoI please take necessary action🙏🏻pic.twitter.com/EOseEcoTRE
— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) April 20, 2025