అక్షరటుడే, ఇందూరు: NEET Exam | నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష neet entrance exam ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష కొనసాగింది. మొత్తం 3,398 మందికి గాను 3,298 మంది హాజరయ్యారు. 100 మంది గైర్హాజరయ్యారు.
NEET Exam | పోలీసులు, కేంద్రం సిబ్బందికి వాగ్వాదం
జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లి (Kasab galli school) ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (Govt girls Junior College nizamabad) పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు, ఎగ్జామినేషన్ సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది. అభ్యర్థులను గేటు లోపలికి అనుమతించే క్రమంలో తనిఖీలు చేయాల్సి ఉండగా.. అయితే పోలీసులే తనిఖీలు చేయాలని ఎగ్జామినేషన్ సిబ్బంది, అది తమ డ్యూటీ కాదని పోలీసులు కొంతసేపు వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులను 11 నుంచి ఉంటే 1.30 గంటల వరకు అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఈ కేంద్రంలో 11:40 వరకు అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.