అక్షరటుడే, వెబ్ డెస్క్: Traveling | వేసవికాలంలో ప్రయాణాలు summer Traveling చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఓ వైపు వేడి గాలులు hot winds, మరోవైపు ఉక్కపోతతో తీవ్ర అలసట వస్తుంటుంది. ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలు మీ ఆరోగ్యంపై health తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. ప్రయాణ travel సమయంలో రోడ్డుపై ఎక్కువ గంటలు గడపడం, తాజా ఆహారం fresh food అందుబాటులో లేకపోవడం, మంచి పోషకాహారం good nutrition తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది ఆరోగ్యంపైనా పెను ప్రభావం చూపుతుంది. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ముందుగానే కొంత ప్రిపరేషన్ చేసుకుంటే ప్రయాణాల సమయంలో మంచి ఆరోగ్యంతో good health పాటు అద్భుతమైన అనుభూతిని కూడా పొందవచ్చు.
Traveling | హైడ్రేటెడ్‌గా ఉండండి
ఎండలో ప్రయాణాలు Traveling చేయడం వల్ల తీవ్ర అలసట వస్తుంది. ప్రధానంగా డీహైడ్రేషన్ dehydration సమస్య ఎదురవుతుంటుంది. మీరు బస్సులో bus, కారులో car ప్రయాణించినా లేదా ఆరుబయట తిరుగుతూ ఉన్నా ఎండ వేడికి శరీరం body త్వరగా అలసి పోతుంది. చెమట ఎక్కువగా రావడంతో నీరసం వస్తుంది. ప్రయాణ సమయంలో కచ్చితంగా వాటర్ బాటిల్ water bottle తీసుకెళ్లాలి. తరచుగా నీరు తాగండి. ఆ వాటర్లో కొంత పింక్ సాల్ట్ pink salt లేదా ఎలక్ట్రోలైట్ పౌడర్ electrolyte powder కలుపుకోవడం ద్వారా శరీరం తిరిగి ఉత్తేజితమవుతుంది.
Traveling | హెల్తీ స్నాక్స్ తీసుకెళ్లండి..
ప్రయాణ travel సమయాలలో ఆకలిగా travel ఉన్నప్పుడు మనం సాధారణంగా చిప్స్ లేదా ఏదైనా ఇతర ప్రీప్యాకేజ్డ్ స్నాక్ prepackaged snack తీసుకుంటాము. అయితే, ఈ ఆహారాలలో సాధారణంగా అధిక ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీని ఫలితంగా ఉబ్బరం, అలసట, గ్యాస్ట్రిక్ సమస్యలు gastric problems ఎదురవుతుంటాయి. వీటికి బదులకు మనకు అనుకూలమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. ఖర్జూరం, బాదం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ dry fruits, అరటిపండ్లు లేదా ఆపిల్ వంటి తాజా పండ్లు తీసుకెళ్లండి. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ snacks మొత్తం ప్రయాణ సమయంలో మనకు అలసట లేకుండా చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని health ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
Traveling | సమతుల్య భోజనం తినండి
ప్రయాణం traveling చేసే సమయంలో మనకు మంచి భోజనం దొరకకపోవచ్చు. బయట తినేటప్పుడు కూరగాయలు, గుడ్లు, చికెన్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఎండాకాలంలో summer ఫ్రై చేసిన ఆహారాలు fried foods తినడం మానుకోండి. ఎందుకంటే అవి అలసటతో పాటు జీర్ణ సమస్యలకు digestive problems దారితీస్తాయి. పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలను probiotic foods లేదా సప్లిమెంట్ తీసుకోవడం ఉత్తమం. భోజనం తర్వాత అల్లం టీ ginger tea లేదా ఫెన్నెల్ టీ వంటి హెర్బల్ టీలు కూడా జీర్ణక్రియకు సహాయపడతాయి. ఉబ్బరం నివారించడంలో సహాయపడతాయి.
Traveling | వీటికి దూరంగా ఉండండి..
వేసవి సెలవుల్లో summer vacations చాలా మంది శీతల పానీయాలు లేదా ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ ఇవి అంత మంచివి కావు. శరీరాన్ని డీహైడ్రేట్ body dehydrate చేస్తాయి. జీర్ణక్రియకు digestion ఆటంకం కలిగిస్తాయి. సోడా లేదా ప్యాక్ చేసిన జ్యూస్లు వంటి చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు blood sugar fluctuations కారణమవుతాయి. వీటికి బదులుగా సాధారణ నీరు, తాజా నిమ్మ సోడా లేదా కొబ్బరి నీరు వంటి సహజమైన హైడ్రేటింగ్ పానీయాలను natural hydrating drinks తీసుకోండి. ఇవి మిమ్మల్ని కూల్గా, తాజాగా ఉంచడమే కాకుండా ప్రయాణించేటప్పుడు మీ శరీరాన్ని అలసిపోనివ్వకుండా దోహదపడతాయి.