Bureau of Indian Standards | బీఐఎస్ శిక్షణ తరగతులకు జిల్లావాసులు
Bureau of Indian Standards | బీఐఎస్ శిక్షణ తరగతులకు జిల్లావాసులు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bureau of Indian Standards | న్యూఢిల్లీలో ఈనెల 5,6 తేదీల్లో బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వినియోగదారుల ప్రతినిధుల శిక్షణ తరగతులు జరుగనున్నాయి. ఈ శిక్షణ తరగతులకు నిజామాబాద్ జిల్లా నుంచి సీసీఐ రాష్ట్ర కార్యదర్శి(CCI State Secretary) సందు ప్రవీణ్, ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి (Indure Consumer Welfare Committee) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్ హాజరు కానున్నారు. వస్తు సేవల నాణ్యతలో బీఐఎస్ ప్రమాణాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ నిబంధనలు, బంగారు, వెండి ఆభరణాలపై మార్కింగ్ విధానం అమలు, తదితర అంశాలపై రెండురోజుల శిక్షణలో వీరు పాల్గొననున్నారు.