అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoists | మావోయిస్టులతో చర్చలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ union minister bandi sanjay సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
2026 మార్చి వరకు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా amit shah ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ operation kagar పేరిట మావోయిస్టులపై కేంద్ర బలగాలు విరుచుకు పడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy, మాజీ సీఎం కేసీఆర్ kcr, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ప్రజాసంఘాల నాయకులు ఆపరేషన్ కగార్ ఆపాలని కోరారు. ఈ క్రమంలో బండి సంజయ్ స్పందించారు.
Maoists | తుపాకీ వీడితేనే..
బండి సంజయ్ మాట్లాడుతూ.. తుపాకులతో అమాయకులను చంపిన వారితో చర్చలు ఉండవన్నారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ congress పార్టీ అని ఆయన గుర్తు చేశారు. మావోయిస్టులు మందుపాతరలు పెట్టి, అన్ని పార్టీల నేతలను చంపారన్నారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ వీడనంత వరకు వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు.
Maoists | కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే..
కాంగ్రెస్ congress, బీఆర్‌ఎస్ brs నాయకులు ఇటీవల మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరడంపైనా.. కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. మావోయిస్టులతో మాటలేవన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాస్పోర్టు లేని విదేశీయులను గుర్తించి వెనక్కి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.