ePaper
More
    HomeతెలంగాణRTC Strike | ఆర్టీసీ సిబ్బందితో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

    RTC Strike | ఆర్టీసీ సిబ్బందితో చర్చలకు సిద్ధం.. మంత్రి కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Strike | తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది RTC Telangana సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ మేనిఫెస్టెలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా తమకు వేతనాలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపి వేస్తామని ప్రకటించారు.

    ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ minister ponnam prabhaker​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మే 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

    ఇటీవల మే డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడిప్పుడే లాభాల్లోకి తెచ్చామని, మళ్లీ సమ్మె చేసి సంస్థను ఆగం చేయొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి ప్రకటనపై కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాలి.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...