అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ hyderabad మెట్రో metro ప్రయాణికులకు త్వరలో షాక్ తగలనుంది. కొంతకాలంగా ఛార్జీల పెంచుతామని చెబుతున్న సంస్థ త్వరలో ఆ నిర్ణయాన్ని అమలు చేయనుంది. హైదరాబాద్ మెట్రో Hyderabad metro charges నష్టాల్లో ఉందని, దాని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ l&t ఎప్పటి నుంచో చెబుతోంది.
ఛార్జీల పెంచడానికి అనుమతి ఇవ్వాలని గతంలో బీఆర్ఎస్ brs ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే ఎన్నికలు రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం అమలు కాలేదు. దీంతో నష్టాలు తగ్గించుకోవడానికి ఛార్జీలను పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట టికెట్ రూ.10, గరిష్ట ధర రూ.60 ఉండగా.. గరిష్ట రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏడాదికి అదనంగా రూ.150 కోట్ల ఆదాయం వస్తోందని సంస్థ భావిస్తోంది. కాగా ఛార్జీల పెంపు నిర్ణయం మే రెండో వారంలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.