అక్షరటుడే, వెబ్‌డెస్క్: Paresh Rawal Anu Agarwal : మని, మని మని, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన పరేష్ రావెల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పి హాట్ టాపిక్ గా మారాడు. తన మోకాలికి గాయం అయితే.. కోలుకోవడానికి తాను యూరిన్ తాగినట్లు తెలిపాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ Bollywood star Ajay Devgan తండ్రి, సీనియర్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్ సలహా మేరకు యూరిన్ తాగినట్లు పరేష్ పేర్కొన్నారు. ఈ విషయం విని అందరూ నోరెళ్లబెట్టారు.
కాగా, పరేష్ రావెల్ బాటలోనే అను అగర్వాల్ కూడా నడిచినట్లు ప్రకటించింది. ఆయన వ్యాఖ్యలకి మద్దతుగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను సైతం యూరిన్ తాగినట్లు హీరోయిన్ అను అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. యూరిన్ తాగడం యోగాలో ఒక భాగమని చెప్పింది. యూరిన్ తాగడం వల్ల ముఖం మీద ముడతలు పోతాయని పేర్కొంది. యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి అంటారని తెలిపింది.
“ఆమ్రోలి Amroli యోగా Yoga ఒక ముద్ర.. దానిని నేను ప్రాక్టీస్ చేశాను. యూరిన్‌లో మనం కొంత తీసుకుంటే మంచిది. యాంటీ ఏజింగ్ విషయంలో హెల్ప్ చేస్తుంది. నా ఆరోగ్య పరంగా అది ఎంతో ప్రయోజనం కలిగించింది” అని అను చెప్పుకొచ్చింది.
వైద్యులు తాగొద్దంటున్నారు కదా అని ఆమెని ప్రశ్నిస్తే.. “సైన్స్ ఎప్పటిది..200 ఏళ్ళు.. యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది.. మీరు రెండింటిలో దేనిని నమ్ముతారు..?” అని ఎదురు ప్రశ్నించింది అమ్మడు.