old woman marries her grandson | 30 ఏళ్ల మనవడితో 50 ఏళ్ల మహిళ పరార్​
old woman marries her grandson | 30 ఏళ్ల మనవడితో 50 ఏళ్ల మహిళ పరార్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 30 ఏళ్ల మనవడి వరసైన యువకుడిని 50 ఏళ్ల మహిళ పెళ్లి చేసుకుని గ్రామం నుంచి పారిపోయింది. ఉత్తర్​ప్రదేశ్​లోని uttarpradesh అంబేడ్కర్ నగర్ జిల్లాలో ambedkar nagar district జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి అనే మహిళకు భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కాగా, ఇదే ప్రాంతంలో ఇంద్రావతి, వరుసకు మనమడు అయ్యే ఆజాద్ నివసించేవారు. ఇటీవల వీరి మధ్య ఉన్న బంధుత్వం కాస్త ప్రేమగా మారింది. ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ ఈ వ్యవహారం గుర్తించి ఆమెను మందలించాడు. కానీ, ఆమె వినలేదు. సరికదా.. ఇంద్రావతి, ఆజాద్​ కలిసి సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం గ్రామం నుంచి పారిపోయారు.

దీంతో చంద్రశేఖర్​ పోలీసులను ఆశ్రయించాడు. కానీ, ఇద్దరూ పెద్దవాళ్లు కావడంతో అతని ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేకపోయారు. అయితే తర్వాత మరో విషయం వెలుగులోకి వచ్చింది. భర్త, పిల్లలను విషమిచ్చి చంపేందుకు ఇంద్రావతి కుట్ర పన్నిన విషయం వెలుగు చూసింది.