అక్షరటుడే, హైదరాబాద్: Cherlapalli Terminal : జీహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. చర్లపల్లి టెర్మినల్‌లో పనులు జరుగుతున్న చోట ఈదురు గాలులకు రేకులు ఎగిరిపడ్డాయి. ఫాల్ సీలింగ్ కుప్పకూలింది.
కుషాయిగూడలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. మల్కాజ్ గిరి, ఉప్పల్, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం పడింది.
రెయిన్ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్ లో కూలిన ఫాల్ సీలింగ్
ఈదురు గాలులు, వర్షం ధాటికి విరిగిపడ్డ ఫాల్ సీలింగ్, ఎలివేషన్
కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఘటన pic.twitter.com/6md43T76Vx
— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2025