అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kagiso Rabada | గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రిక south africa ఫాస్ట్ బౌలర్ fast bowler అందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ iplలో గుజరాత్ తరఫున ఆడుతున్న రబాడా మధ్యలో నుంచే స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే తాను మ్యాచ్‌లకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని రబాడా శనివారం వెల్లడించాడు. డ్రగ్స్ కేసులో పాజిటివ్‌గా తేలడంతో తనపై తాత్కాలిన నిషేధం విధించినట్లు ఆయన తెలిపాడు. రబాడ నిషేధిత మత్తుమందు వాడినట్లు తేలడంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సైతం దూరం కానున్నారు.
అన్ని ఫార్మాట్లలో అతనిపై దక్షిణాఫ్రిక క్రికెట్ బోర్డు తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దీంతో రబాడా కొద్ది రోజులు ఆటకు దూరం కానున్నారు. అయితే అది ఎంత కాలమన్నది ఆయన ప్రకటించలేదు. దీనిపై రబాడా స్పందిస్తూ అభిమానులను నిరాశ పరిచినందుకు తీవ్రంగా చింతిస్తున్నానని ప్రకటించారు. క్రికెట్ cricket ఆడే అవకాశాన్ని తాను ఎప్పటికీ తేలికగా తీసుకోనని, ఈ అవకాశం తనకన్న గొప్పది అని అన్నారు. తాను తిరిగి ఆడటానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.