- Advertisement -
HomeUncategorizedIndian film industry | ఏడాదిలో రూ.5 లక్షల కోట్లు.. భారత చిత్రపరిశ్రమ, టీవీ, ఓటీటీల...

Indian film industry | ఏడాదిలో రూ.5 లక్షల కోట్లు.. భారత చిత్రపరిశ్రమ, టీవీ, ఓటీటీల ఆదాయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian film industry | దేశంలో వినోద రంగానికి entertainment sector ప్రాధాన్యం పెరుగుతోంది. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఇది మంచి వేదికగా good platform మారింది. అలాగే, ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. భారత్ లో చిత్ర పరిశ్రమ film industry, టీవీ TV, ఓటీటీ సేవలు OTT services విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగావకాశాలతో job opportunities పాటు ఆదాయ సృష్టి కూడా విపరీతంగా పెరుగుతోంది. ఒక్క 2024 సంవత్సరంలోనే భారత సినీ పరిశ్రమ, టీవీ, ఓటీటీ సేవల ద్వారా రూ. 5.15 లక్షల కోట్లు (61.2 బిలియన్ డాలర్లు) సంపద సృష్టి జరిగిందని డెలాయిట్, మోషన్ పిక్సర్ Motion Pixar అసోసియేషన్ నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలోనే 26 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపింది. ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ World Audio Visual Entertainment (వేవ్స్) సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది.

Indian film industry | సవాళ్లను అధిగమించి..

అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ సినిమా, టీవీ, ఓటీటీ పరిశ్రమలు తట్టుకుని నిలబడ్డాయని నివేదిక వెల్లడించింది. పెద్ద, చిన్న తెరలపై సినిమాలు, నాటకాలు, క్రీడల కోసం పెరుగుతున్న ప్రేక్షకుల డిమాండ్ కు ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ రంగంలో గతేడాది 8.2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను, 26.4 లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. 2029 నాటికి ఈ రంగం 9.3 లక్షల ప్రత్యక్ష, 30 లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేసింది. రూ. 2.5 లక్షల కోట్ల మీడియా, వినోద పరిశ్రమ సామర్థ్యాన్ని మరింతగా అన్లాక్ చేయాలని WAVES చూస్తోందని తెలిపింది.

- Advertisement -

Indian film industry | విస్తరిస్తున్న గేమింగ్ రంగం

రాబోయే నాలుగు సంవత్సరాలలో స్థానిక పరిశ్రమ ఆరు నుంచి ఏడు శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు compound annual growth rate (CAGR) వద్ద వృద్ధి చెందుతుందని నివేదిక వెల్లడించింది. ఇది 2029లో దాదాపు రూ. 147,000 కోట్లకు(17.5 బిలియన్ డాలర్లు) చేరుకుంటుందని అంచనా వేసింది. సమర్థవంతమైన నియంత్రణ లివర్లు అమలులో ఉంటే, పరిశ్రమ తొమ్మిది నుండి 10 శాతం CAGR అధిక వృద్ధి పథాన్ని higher growth scheem చూడవచ్చని, ఇది FY29 లో దాదాపు రూ. 165,000 కోట్లకు ఆదాయాలకు సమానమని తెలిపింది. ఇక, భారతదేశ గేమింగ్ మార్కెట్ India gaming market కూడా జోరుగా విస్తరిస్తోంది. గతేడాది 2024లో రూ. 31,000 కోట్లకు చేరుకుంది. రానున్న ఐదు సంవత్సరాలలో ఇది మూడు రెట్లు పెరగుతుందని, రూ. 77,000 కోట్ల సంపద సృష్టికి చేరుకుంటుదని నివేదిక తెలిపింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో ఐపీ మానిటైజేషన్ కు గేమ్ లు సర్వ సాధారణమయ్యాయి. బాహుబలి Baahubali వంటి సినిమాలు మొబైల్ గేమ్ లుగా mobile games వచ్చాయి.

Indian film industry | యానిమేషన్ విభాగం

భారతదేశ యానిమేషన్ విభాగం India’s animation sector కూడా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో 2023లో రూ. 11,000 కోట్లుగా ఉన్న ఆదాయం 2026 నాటికి రూ. 18,000 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. భారతీయ చలనచిత్ర రంగం Indian film industry అధిక నిర్మాణ నాణ్యత, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆధారిత చిత్రాల వైపు అభివృద్ధి చెందుతున్నందున, AVFX (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్) రంగం మరింత వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News