అక్షరటుడే, ఆర్మూర్:Armoor | ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, కొనుగోళ్లు చేపట్టడం లేదని బీఆర్‌ఎస్(BRS) జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(Former MLA Jeevan Reddy) మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు(Farmers) కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పంటను కొనుగోలు చేస్తారా లేదా సూటిగా చెప్పాలన్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల(Purchasing Centers) నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా మారిందని, అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
