- Advertisement -
Homeబిజినెస్​Croma 'Festival of Dreams' | క్రోమాలో 'ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్'.. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై ఫ్లాట్...

Croma ‘Festival of Dreams’ | క్రోమాలో ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’.. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై ఫ్లాట్ తగ్గింపు ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Croma ‘Festival of Dreams’ | పండుగల సీజన్‌ను పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ ఓమ్ని-ఛానెల్ ఎలక్ట్రానిక్స్ omni-channel electronics రిటైలర్ అయిన టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా.. ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో వార్షిక పండుగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

ఈ క్యాంపెయిన్లో వినియోగదారులకు మరింత ఆనందాన్ని, పండుగ మెరుపులను జోడించడానికి అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

- Advertisement -

స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్లపై వినియోగదారులు భారీ తగ్గింపులతో పాటు, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను పొందొచ్చు.

జీఎస్టీ సంస్కరణల GST reforms నేపథ్యంలో టీవీలు, ఎయిర్ కండిషనర్లపై అదనంగా 10% ఆదా చేసుకునే అవకాశం ఉంది. స్టోర్‌లతోపాటు Tata Neu,croma.com యాప్‌ల ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు.

దసరా, ధనత్రయోదశి, దీపావళి, భాయ్ దూజ్ పండుగలను మరింత ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకు అక్టోబరు 23 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, భారీ తగ్గింపులు, 20% వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, EMI ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

Croma ‘Festival of Dreams’ | అత్యధికంగా అమ్ముడైన కేటగిరీలపై పండుగ తగ్గింపులు:

  • టీవీల TVs పై 35% తగ్గింపు
  • స్మార్ట్‌ఫోన్‌ల smartphones పై 15% తగ్గింపు
  • రిఫ్రిజిరేటర్ల refrigerators పై 25% తగ్గింపు
  • వాషింగ్ మెషీన్‌ల washing machines పై 30% తగ్గింపు
  • ఎయిర్ కండిషనర్ల air conditioners పై 35% తగ్గింపు
  • ల్యాప్‌టాప్‌ల laptops పై 20% తగ్గింపు
  • స్మాల్ హోమ్ & కిచెన్ ఉపకరణాల kitchen appliances పై 35% తగ్గింపు
  • ఇయర్‌ఫోన్‌లు/హెడ్‌ఫోన్‌ల headphones పై 45% తగ్గింపు
  • హోమ్ ఆడియో home audio పై 30% తగ్గింపు

ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. పండుగ షాపింగ్ అనేది సులభంగా, ఆనందంగా, ఒత్తిడి లేకుండా ఉండాలన్నారు.

దసరా, ధనత్రయోదశి, దీపావళి, భాయ్ దూజ్‌లకు ప్రత్యేక ఆఫర్‌ల ద్వారా అదనపు సంబరాలను అందిస్తున్నామన్నారు.

క్రోమా ‘కనెక్టెడ్ షాపింగ్’ అనుభవం వినియోగదారులకు ఆన్‌లైన్‌లో వస్తువులను వెతకడానికి, రిజర్వ్ చేసుకోవడానికి, స్టోర్‌లో వాటిని సేకరించడానికి అవకాశం కల్పిస్తోంది.

ఆన్‌లైన్‌లో, స్టోర్‌లో కూడా ఒకే రకమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారులు తమ దగ్గరలోని క్రోమా స్టోర్‌లో పండుగ ఆఫర్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News