- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Yatra danam | యాత్రదానం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Yatra danam | యాత్రదానం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Yatra danam | రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యాత్ర దానం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో (Collectorate Nizamabad) శుక్రవారం రాత్రి వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దాతలు, వర్తకులు, నాయకులు, తమ వారిని లేదా అనాథలను, అభాగ్యులను యాత్ర దానం పథకం ద్వారా వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. ఆయా రకాల బస్సులను తక్కువ ధరలతో ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న (RTC Regional Manager Jyotsna), డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, నిజామాబాద్–1 డిపో మేనేజర్ ఆనంద్, డిప్యూటీ ఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News