- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Sub-Collector | బోధనా ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి

Bodhan Sub-Collector | బోధనా ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి

- Advertisement -

అక్షర టుడే, బోధన్: Bodhan Sub-Collector | ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తమ బోధనా ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలని, తద్వారా విద్యార్థులకు సులభరీతిలో పాఠాలు బోధించాలని సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయ యాజమాన్య కమిటీతో త్రైమాసిక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయాల (Kendriya Vidyalayas) కార్యకలాపాలు, అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా విద్యార్థుల అకాడమిక్‌ ప్రదర్శన, మెరుగైన ఫలితాల సాధనకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు, పీఎం శ్రీ కింద పాఠశాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల కోసం పెగడాపల్లి పీహెచ్‌సీ (Pegadapalli PHC) వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News