- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Bodhan MLA | లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం : బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి

Bodhan MLA | లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం : బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి

- Advertisement -

అక్షర టుడే, బోధన్: Bodhan MLA | సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండే లయన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయమని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. శుక్రవారం లయన్స్‌ కంటి ఆసుపత్రి సమావేశ మందిరంలో బోధన్‌ డివిజన్‌ అంగన్వాడీ మీటింగ్‌ (Bodhan Division Anganwadi meeting) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

అంతకుముందు లయన్స్‌ క్లబ్‌ (Lions Club) ఆధ్వర్యంలో డివిజన్‌లోని అంగన్వాడీ కేంద్రాలకు 1500 కుక్కర్‌లను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాజిక సేవలో లయన్స్‌ క్లబ్‌ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో (Sub-Collector Vikas Mahato), సీడీపీఓ పద్మ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్, డీసీసీబీ ఛైర్మన్‌ నగేష్‌ రెడ్డి, డీసీసీ డెలిగేట్‌ గంగశంకర్, బోధన్‌ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News