- Advertisement -
HomeతెలంగాణACB Trap | వైర్​​ మార్చడానికి రూ.30 వేలు డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

ACB Trap | వైర్​​ మార్చడానికి రూ.30 వేలు డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన లైన్​మన్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ అవినీతికి పాల్పడే వారి పని పడుతున్నారు.

ఇటీవల ఏసీబీ కేసులు (ACB Case) పెరిగాయి. ప్రజల్లో అవగాహన రావడంతో పాటు ఫిర్యాదు చేయగానే అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. దీంతో అవినీతి అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోతున్నారు. ఏసీబీ దాడులు చేపడుతున్నా లంచాలకు మరిగిన అధికారులు మాత్రం మారడం లేదు. డబ్బులు తీసుకోనిదే పనులు చేయడం లేదు. తాజాగా ఓ జూనియర్​ లైన్​మన్ ​(Junior Lineman)ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని గచ్చిబౌలి డివిజన్​లో పని చేస్తున్న జూనియర్​ లైన్​మన్​ శ్రీకాంత్​ గౌడ్​ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. డివిజన్​ పరిధిలో ఓ వ్యక్తి తన ఇంటికి విద్యుత్​ ప్రవాహాన్ని 5కేవీ 11కేవీ మార్చాలని లైన్​మన్​ను​ కలిశాడు. దీని కోసం వైరింగ్​ మార్చడంతో పాటు మీటర్​ విప్పి మళ్లీ సీల్​ చేయడానికి ఆయన​ రూ.30 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం బాధితుడి నుంచి రూ.11 వేల లంచం తీసుకుండగా.. జూనియర్​ లైన్​మన్ శ్రీకాంత్​ గౌడ్​​ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ​ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News