అక్షరటుడే, ఇందూరు: Gymnasium | మనిషి శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం (exercise) తప్పనిసరి అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార దర్శి వెంకన్న, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజకుడు శివరాములు (Bajrang Dal state coordinator Shivaramulu) అన్నారు.
వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆదర్శ్నగర్లో గల విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వ్యాయామశాలను (gymnasium) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాయామశాల కేవలం శారీరక దృఢత్వం కోసమే కాదని.. యువతలో ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఉచిత వ్యాయామశాలను ఇందూరులోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, విభాగ్ కార్యదర్శి కృష్ణ, జిల్లా కార్యదర్శి దయానంద్, ఆనంద్, ధాత్రిక రమేశ్, నాంపల్లి శేఖర్, రాంప్రసాద్ చటర్జీ, నికేష్, బజరంగ్దళ్ అఖిల్, సురేష్, సుధీర్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.