అక్షరటుడే, బోధన్: Ushodaya Degree College | పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను (Bathukamma celebration) ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి పద్మ (Child Welfare Officer Padma) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు (students) కృషి పట్టుదలతో చదువుకోవాలని..తద్వారా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉద్బోధించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ (College principal Gangadhar) మాట్లాడుతూ.. విద్యార్థి జీవితం పువ్వుల వలె రంగుల హరివిల్లు కావాలని ఆకాంక్షించారు. బతుకమ్మ ప్రాధాన్యతను వివరించారు.
కళాశాల ప్రతినిధులు రమణి సునీత దుష్యంత్, వెంకట రమణి మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఎదగాలని సూచించారు. ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ప్రతినిధులు పాల్గొన్నారు.