అక్షరటుడే, కోటగిరి: Pothangal mandal | పోతంగల్ మండలం కల్లూరులో (Kallur) గ్రామాభివృద్ధి కార్యవర్గ ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న 18 కులాలు కలిసి ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పాశపు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా శ్రవణ్, సెక్రెటరీ గోపాల్ను ఎన్నుకోవడం జరిగింది.
ప్రతి మూడేళ్లకొకసారి గ్రామ అభివృద్ధి కమిటీని (Village Development Committee) ఎన్నుకోవడం జరుగుతుందని గ్రామస్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాలకృష్ణ మాట్లాడుతూ.. గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, లింగప్ప, రాంరెడ్డి, మక్కయ్య, కుల సంఘాల సంఘాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.