- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిEx Mla Gampa Govardhan​ | ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు..

Ex Mla Gampa Govardhan​ | ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Ex Mla Gampa Govardhan​ | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ఫెయిల్యూర్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పాల్వంచ మండలంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి.. అధికారంలోకి రాగానే మాట మార్చిందన్నారు. రైతులు, ప్రజలు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ (BRS Kamareddy) అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు.

- Advertisement -

పార్టీ వీడిన, ద్రోహం చేసిన వారికి పక్కాగా చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, మాజీ జెడ్పీటీసీ మినుకురి రాంరెడ్డి, పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, పాల్వంచ మండలంలోని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News