- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​MP Suresh Shetkar | కార్యకర్తలకు అండగా ఉంటా: ఎంపీ సురేశ్​ షెట్కార్

MP Suresh Shetkar | కార్యకర్తలకు అండగా ఉంటా: ఎంపీ సురేశ్​ షెట్కార్

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: MP Suresh Shetkar | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన కార్యకర్తలకు అండగా నిలుస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్​ (Zaheerabad MP Suresh Shetkar) పేర్కొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి శుక్రవారం ఎంపీని కలిశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో (MP elections) కష్టపడి శ్రమించిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada constituency) నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని, ఎవరికీ టికెట్ వచ్చినా తాము పార్టీ కోసం పనిచేయడమే ధ్యేయమని చంద్రశేఖర్, రాజారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి నిస్వార్థ కార్యకర్తలను కాపాడాలని వారు కోరారు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానని ఎంపీ సురేశ్​ షెట్కార్​ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News