అక్షరటుడే, ఇందూరు : Intermediate Education | విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ ఖలీంసాబ్ (MD Khalim Saab) పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆదేశించింది.
ఈ మేరకు కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రణాళిక, విద్యార్థుల క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని గౌరవించి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Intermediate Education | గాంధారి కళాశాలలో..
అక్షరటుడే, గాంధారి : గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Gandhari Government Junior College) శుక్రవారం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గడ్డం గంగారం (Principal Gaddam Gangaram) మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు.
కళాశాల సాధించిన ఘనతను అభివృద్ధి కోసం వచ్చిన నిధులను ప్రిన్సిపాల్ అందరికీ వివరించారు. తల్లిదండ్రుల, అధ్యాపకులు సమన్వయం వల్లే విద్యా వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందన్నారు. కొంతమంది విద్యార్థులకు మార్గదర్శకం, కౌన్సిలింగ్ కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని తోటి లెక్చరర్లకు సూచించారు. కార్యక్రమంలో లెక్చలర్లు రాజగోపాల్, లక్ష్మణ్, విజయ్ కుమార్, శ్రీధర్, రమేష్, వెంకటస్వామి, సరిత సుజాత స్వప్న సాంబాజి మమత తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.