అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chakali Ailamma | సాయిధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ అని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో వీరనారి చౌకలి ఐలమ్మ (Veeranari Chaukali Ailamma) ధీరత్వాన్ని కొనియాడారు. అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఎఆర్) కె.రాంచందర్ రావు, పరిపాలన అధికారి ఆసియా బేగం, సైబర్ క్రైమ్ ఏసీపీ వై.వెంకటేశ్వర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజా రాణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, సీఎస్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Chakali Ailamma | కామారెడ్డిలో..
పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పూలమాలలు వేసి నివాళులర్పించారు.