ePaper
More
    HomeతెలంగాణConstable transfers | కానిస్టేబుళ్ల బదిలీలకు కసరత్తు.. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తే ట్రాన్స్‌ఫర్‌ తప్పనిసరి

    Constable transfers | కానిస్టేబుళ్ల బదిలీలకు కసరత్తు.. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తే ట్రాన్స్‌ఫర్‌ తప్పనిసరి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Constable transfers | నిజామాబాద్‌ కమిషనరేట్‌ nizamabad police commissionerate పరిధిలో అతిత్వరలో కానిస్టేబుళ్ల బదిలీలు consitable transfers జరగనున్నాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య cp sai Chaitanya కసరత్తు జరుపుతున్నారు. కానిస్టేబుళ్లు మొదలుకుని ఏఎస్సై వరకు ట్రాన్స్‌ఫర్స్‌ చేయనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం కమిషనరేట్‌ పరిధిలోని అన్ని స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న వారి సిబ్బంది వివరాలను సీపీ సేకరిస్తున్నారు. వీరిలో లాంగ్ స్టాండింగ్ long standing ఉన్నవారికి బదిలీ తప్పనిసరి కానుంది. 2024 మార్చి 31 వరకు ఐదేళ్లుగా ఒకేచోట పోస్టింగులో ఉన్నవారు తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే హెడ్‌కానిస్టేబుళ్లకు నాలుగేళ్లు, ఏఎస్సైలకు మూడేళ్లుగా ఒకేచోట ఉంటే వారిని బదిలీ చేయనున్నారు.

    సీపీ సూచనల మేరకు అన్ని స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న వారి జాబితాను అందజేశారు. వచ్చే వారంలో ఈ బదిలీలపై తుది కసరత్తు జరగనుంది. తదనంతరం సిబ్బంది బదిలీలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసే అవకాశాలున్నాయి.

    Constable transfers | తీవ్ర ఆరోపణలు వస్తే వేటే..!

    ఇటీవల కమిషనరేట్​ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ police constable suspension​ వేటు పడింది. డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలతో పాటు ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బులు దండుకోవడంతో దీనిపై సీపీ చర్యలు తీసుకున్నారు. కాగా.. వారిపై క్రిమినల్​ కేసులు సైతం నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో ఆరోపణలున్న వారి పట్ల కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య ips Sai Chaitanya మిగతా వారికి సంకేతాలు పంపించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...