అక్షరటుడే, బోధన్: Bodhan MLA | నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) తెలిపారు. ఈ మేరకు నవీపేట్ మండలం (Navipet Mandal) హనుమాన్ ఫారంలో, సాలూరు మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బోధన్ నియోజకవర్గంలో (Bodhan constituency) ఒక్క సబ్‌స్టేషన్ కూడా మంజూరు చేయలేదన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు విద్యుత్ అంతరాయంతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి రాగానే విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
కొత్తగా నిర్మించబోయే సబ్స్టేషన్లను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని ఆదేశించామని తెలిపారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ. 2.23కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (Taher Bin Hamdan), డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బోధన్ డీఈ ముక్తార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ రాంచందర్, ఎస్ఈ రాపల్లి రవీందర్, డీఈ నిజామాబాద్ ఎం.శ్రీనివాస్, ఏడీఈ కన్స్‌స్ట్రక్షన్స్ తోట రాజశేఖర్, ప్రశాంత్‌రెడ్డి, నగేష్‌కుమార్, నవీపేట్ ఏఈ ఆనంద్, శ్రీనివాస్, కన్స్‌స్ట్రక్షన్ వినోద్, ఏఈ సుమిత, కళ్యాణ్, మాజీ జెడ్పీటీసీలు శ్రీనివాస్ గౌడ్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.