అక్షరటుడే, కామారెడ్డి: SP Kamareddy | హైవే పక్కన ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా (Interstate robbery gang) సభ్యులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వివరాలను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వివరించారు.
భిక్కనూరు మండలం బస్వాపూర్ (Baswapur) గ్రామంలో ఈనెల 10న పెద్దమ్మ గుడి హుండీలో నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అలాగే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి హుండీలలో డబ్బులను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.
పోలీసుల విచారణలో ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా పలు చోరీల వివరాలు బయటకు వచ్చాయి. హైవేపై ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు చోరీలకు పాల్పడుతున్నటు గుర్తించారు.
గతనెల 19న రామాయంపేట (Ramayampet) పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడి, సదాశివనగర్ మండలంలో ఎల్లమ్మ గుడిలో, ఈ నెల 9న రామాయంపేట పరిధిలోని అయ్యప్ప ఆలయంలో హుండీలోని నగదు, వెండి పూజా సామాగ్రి దొంగిలించారు. అదేరోజు భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో హుండీలో నగదు, అమ్మవారి వెండి కళ్లు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు.
బస్వాపూర్ గ్రామంలోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన గాంధారి సత్యం, మహారాష్ట్ర లాతూర్ జిల్లా అహ్మద్ నగర్‌కు చెందిన సయ్యద్ సమీర్, మహారాష్ట్ర లాతూర్కు చెందిన అహ్మద్ పఠాన్లు చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అహ్మద్ పఠాన్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.
నిందితుల నుంచి రెండు మొబైల్స్, ఒక ఆటో, మూడు జతల అమ్మవారి వెండి కళ్లు, తీర్థం చెంచా, ప్లేటు, వెండి దీపాలు, ఆటో కొనుగోలు చేసిన కాగితం, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు, వెండి వస్తువులు, సెల్ఫోన్లు