- Advertisement -
HomeతెలంగాణNote for Vote Case | ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక తీర్పు.. మత్తయ్యకు...

Note for Vote Case | ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక తీర్పు.. మత్తయ్యకు ఊరట

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Note for Vote Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం(State Government) దాఖలు చేసిన పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసింది.

బీఆర్​ఎస్​ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఓటు నోటు కేసు(Note for Vote Case) వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ నాయకులు తమకు ఓటు వేయాలని నామినేటెడ్​ ఎమ్మెల్యే స్టిఫెన్​ సన్​కు డబ్బులు ఇచ్చినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో టీడీపీ నాయకులు, స్టిఫెన్​సన్​కు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు మత్తయ్యపై కేసు నమోదు అయింది. అయితే ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌‌ను హైకోర్టు(High Court) గతంలోనే కొట్టి వేసింది. దీంతో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను శుక్రవారం కొట్టేసింది.

- Advertisement -

Note for Vote Case | 2016లో పిటిషన్

ఈ కేసులో మత్తయ్యపై 2016లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. దీనిని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ 2016 జులై 6వ తేదీన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఈ నెల 22న వాదనలు ముగిశాయి. శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి వాదించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌, ఏ4 మత్తయ్య దాదాపుగా ఇరవై సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారని తెలిపారు. దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Note for Vote Case | ‘ఆయనను ఇరికించారు’

హైకోర్టు మత్తయ్యను విచారించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్ఐఆర్​ కొట్టివేసిందని మేనక గురుస్వామి అన్నారు. అయితే ఈ వాదనలను మత్తయ్య(Jerusalem Matthayya) తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన అసలు క్రైమ్​ సీన్​లోనే లేరని, కేసులో ఇరికించారని వాదించారు. ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. తాజాగా తుది తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్​ కొట్టివేసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News