అక్షరటుడే, భీమ్‌గల్: Anil Eravathri | టీజీఎండీసీ (TGMDC) ఛైర్మన్ అనిల్ ఈరవత్రి జన్మదిన వేడుకలను భీమ్‌గల్‌లో (Bheemgal) శుక్రవారం నిర్వహించారు. భీమ్‌గల్ పట్టణంతో పాటు.. బడా భీమ్‌గల్ (Bada Bheemgal) ముచ్కూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. గతంలో ప్రభుత్వ విప్‌గా ప్రస్తుతం టీజీఎండీసీ ఛైర్మన్‌గా బాల్కొండ ప్రాంతానికి ఆయన చేస్తున్న సేవలను నాయకులు కొనియాడారు.
Anil Eravathri | యువకుల రక్తదానం..
అనంతరం యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్ర, మండల నాయకులు గట్టు సతీశ్, రాగుల మోహన్, పిట్ల శ్రీనివాస్, కుమ్మరి శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.