- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth Reddy | వేల్పూర్​లో ఇండోర్ స్టేడియం ప్రారంభం

Mla Prashanth Reddy | వేల్పూర్​లో ఇండోర్ స్టేడియం ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth Reddy | వేల్పూర్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంను (Indoor stadium) ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapalli Santosh Kumar) ఎంపీగా ఉన్న సమయంలో ఇండోర్​ స్టేడియం మరమ్మతులకు రూ.35 లక్షల నిధులు మంజూరు చేశారు. వీటితో షటిల్, కబడ్డీ కోర్టులను బాగు చేయించారు.

కాగా.. ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి శుక్రవారం స్టేడియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు స్టేడియంను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేల్పూర్​నకు (Velpur) గుర్తింపు తేవాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Mla Prashanth Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని బాల్కొండ, వేల్పూర్, ముప్కాల్, మోర్తాడ్, కమర్​పల్లి, భీమ్​గల్​ మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News