అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pooja Hegde | తెలుగు చిత్రసీమ(Telugu Film Industry)లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి, కేవలం తన అందం, అభినయంతోనే కొద్ది కాలంలోనే టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా నిలిచింది.
కానీ… ఇప్పుడామె కెరీర్ పాతాళానికి చేరినట్టు కనిపిస్తోంది. పూజా హెగ్డే(Pooja Hegde)కు తొలి బ్రేక్ ముకుంద (2014) సినిమాతో వచ్చింది. ఆ తర్వాత ఒక లైలా కోసం వంటి చిత్రాలతో తన ప్రస్థానాన్ని కొనసాగించింది. కెరీర్ ఆరంభంలో పెద్దగా విజయం అందుకోలేకపోయినా, ఆ తర్వాత “దువ్వాడ జగన్నాథం”, “అరవింద సమేత”, “మహర్షి”, “గద్దలకొండ గణేష్”, “అలా వైకుంఠపురంలో” వంటి వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Pooja Hegde | కెరీర్ డౌన్..
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఘనత ఈ అమ్మడి సొంతం. అయితే వరుస హిట్స్ తర్వాత రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో పూజా కెరీర్ ఊహించని మలుపు తీసుకుంది. అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. కానీ అక్కడ కూడా బాక్సాఫీస్ పరంగా ఆమెకు ఆశించిన విజయాలు అందలేదు.
కొంత గ్యాప్ తర్వాత పూజా హెగ్డే రెట్రో మూవీతో దక్షిణాదికి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఆ పాటలో ఆమె డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయినా, సినిమా మాత్రం పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.తెలుగు, తమిళ, హిందీ… అన్ని ఇండస్ట్రీలలో ఒకప్పుడు టాప్ ప్లేస్ దక్కించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలకు దూరంగా, సైలెంట్ మోడ్‌లో కనిపిస్తోంది. అయితే గ్లామర్, నటన రెండూ ఉన్న ఈ బ్యూటీకి ఒక మంచి స్క్రిప్ట్, మరిచిపోలేని పాత్ర దొరికితే రీ ఎంట్రీలో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం.