అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వరదలతో తీవ్ర నష్టం జరిగింది.
అనేక గ్రామాలు ముంపునకు గురై పంటలు నాశనం అయ్యాయి. అలాగే వందలాది ఇళ్లు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. తాగునీటి వనరులు చెడిపోయి, విద్యాసంస్థలు కూడా నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్ (World Bank) గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకి (GFDRR) విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం, భవిష్యత్ విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం రూ.100 కోట్ల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని కోరారు.
Mla Madan Mohan | ప్రతిపాదనలివే..
– వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు తక్షణ సహాయం అందించడం.
– కూలిపోయిన, ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణంతో పాటు పేద బలహీన వర్గాలకు సహాయం.
– పబ్లిక్ వాటర్ ట్యాంకులు(Public water tanks), పైపులైన్ వ్యవస్థ పునరుద్ధరణ, శుద్ధి చేసిన నీటిని అందుబాటులోకి తేవడం.
– వరదలతో దెబ్బతిన్న పాఠశాలల మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన.
– దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం, గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పునరుద్ధరణ.
– ప్రజల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే చర్యలు. దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.