- Advertisement -
HomeజాతీయంMIG-21 Jets | 63 ఏళ్ల పాటు సేవలు.. మిగ్​ 21 యుద్ధ విమానాలకు వీడ్కోలు

MIG-21 Jets | 63 ఏళ్ల పాటు సేవలు.. మిగ్​ 21 యుద్ధ విమానాలకు వీడ్కోలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MIG-21 Jets | దశాబ్దాలు భారత సైన్యానికి సేవలు అందించిన మిగ్​ –21 యుద్ధ విమానాలకు ఎయిర్​ ఫోర్స్​ వీడ్కోలు పలికింది. ఎన్నో యుద్ధాల్లో భారత్​కు విజయాన్ని అందించిన ఈ విమానాలకు శుక్రవారం ఎయిర్​ ఫోర్స్​ చీఫ్​ ఏపీ సింగ్ (Air Force Chief AP Singh)​ ఘనంగా వీడ్కోలు పలికారు.

చంఢీగడ్​లోని ఎయిర్​ఫోర్స్ కేంద్రంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ (Minister Rajnath Singh)​, వాయుసేన సీనియర్​, మాజీ అధికారులు హాజరు అయ్యారు. కాగా.. భారత వైమానిక దళంలో MiG-21 ప్రయాణం అద్భుతంగా సాగింది. దాదాపు 900 మిగ్​ 21 యుద్ధ విమానాలు ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్ (Indian Air Force)​ నిర్వహించింది.

- Advertisement -

MIG-21 Jets | ఎందుకోసం అంటే..

మిగ్​ –21 యుద్ధ విమానాలు పాత తరానికి చెందినవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలం కావు. దీంతో పాటు మిగ్​ –21 విమానాలు తరుచూ కూలిపోయేవి. దీంతో వీటిని ఎగిరే శవపేటికలు అని ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో వీటిని వాడొద్దని ఐఏఎఫ్‌ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా వాటి సేవలకు వీడ్కోలు పలికింది. కాగా.. మిగ్​–21 యుద్ధ విమానాలను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది. 1963లో మొదటి సారి భారత్​లోకి మిగ్​ 21 వచ్చింది. తర్వాత సుఖోయ్​ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే వరకు మిగ్​–21 విమానాలు భారత వైమానిక దళంలో అనేక సేవలు అందించాయి. మిగ్​–21 యుద్ధ విమానాల(MIG-21 Jets) స్థానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్​ భర్తీ చేయాలని ఐఏఎఫ్​ యోచిస్తోంది.

MIG-21 Jets | ఆ యుద్ధాల్లో కీలక పాత్ర

భారత్​ – పాకిస్తాన్​ మధ్య జరిగిన 1965 యుద్ధం, బంగ్లాదేశ్​ విముక్తి సమయంలో 1971 జరిగిన యుద్ధంలో మిగ్​–21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. పాకిస్తానీ F-86, F-104 స్టార్‌ఫైటర్‌లను కూల్చివేశాయి. తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్​ లొంగిపోవడానికి సహాయపడిన ఢాకాలోని గవర్నర్ ఇంటిపై ప్రసిద్ధ బాంబు దాడితో సహా భూ దాడులను కూడా నిర్వహించాయి. 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలకోట్ వైమానిక దాడుల్లో సైతం ఇవీ సేవలు అందించాయి. మిగ్​ 21 యుద్ధ విమానాలను భారత్ మొదట రష్యా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం సాంకేతిక బదిలీ చేయడంతో 600 విమానాలు భారత్​లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News