అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) వరుసగా ఆరో రోజూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటనతో ఫార్మా రంగంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, రియాలిటీ రంగాలు స్వల్ప లాభాలతో ఉండగా.. మిగిలిన అన్ని సెక్టార్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 203 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 72 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్(Sensex) 80,708 నుంచి 81,033 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,759 నుంచి 24,868 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 388 పాయింట్ల నష్టంతో 80,770 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 24,768 వద్ద ఉన్నాయి.
Stock Market | అన్ని రంగాల్లో సెల్లాఫ్..
బీఎస్ఈ(BSE)లో ఆటో, ఇండస్ట్రియల్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతుండగా.. మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.68 శాతం, టెలికాం 1.30 శాతం, ఐటీ 1.29 శాతం, యుటిలిటీ 0.79 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్, మెటల్, పవర్ ఇండెక్స్‌లు 0.77 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.69 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.62 శాతం నష్టాలతో ఉన్నాయి. ఇండస్ట్రియల్ Index 0.08 శాతం, ఆటో 0.05 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.89 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం నష్టాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎల్టీ 2.56 శాతం, టాటా మోటార్స్ 2.08 శాతం, మారుతి 0.84 శాతం, ట్రెంట్ 0.52 శాతం, ఐటీసీ 0.52 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : సన్‌ఫార్మా 2.97 శాతం, టాటా స్టీల్ 1.92 శాతం, ఆసియా పెయింట్ 1.63 శాతం, ఇన్ఫోసిస్ 1.44 శాతం, ఎంఅండ్ఎం 1.41 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.