- Advertisement -
Homeబిజినెస్​Pre market analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను...

Pre market analysis | ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis యూఎస్‌ మార్కెట్లు(US market) వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.

శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాల బాటలోనే ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది.

- Advertisement -

Pre market analysis | యూఎస్‌ US మార్కెట్లు..

నాస్‌డాక్‌(Nasdaq) 0.50 శాతం, ఎస్‌అండ్‌పీ 0.50 శాతం నష్టపోయాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.10 శాతం లాభంతో సాగుతోంది.

Pre market analysis | యూరోప్‌ మార్కెట్లు..

డీఏఎక్స్‌ 0.56 శాతం, సీఏసీ 0.41 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.40 శాతం నష్టంతో ముగిశాయి.

Pre market analysis | ఆసియా ASIA మార్కెట్లు..

శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు Markts ఎక్కువగా నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌(Straits times) 0.27 శాతం లాభంతో కొనసాగుతోంది.

సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.08 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 2.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.70 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.16 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.03 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 4,995 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయిచారు.

డీఐఐ(DII)లు వరుసగా 23వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 5,103 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.97 నుంచి 0.87 కు తగ్గింది. విక్స్‌(VIX) 0.96 శాతం పెరిగి 10.52 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 69.68 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 88.67 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.18 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.38 వద్ద కొనసాగుతున్నాయి.

యూఎస్‌ ఫెడ్‌ రేట్‌ కట్‌ను ప్రకటించినా.. కామెంటరీ కాషియస్‌గా ఉండడంతోపాటు ఎకనామిక్‌ డాటా బలంగా రావడంతో తదుపరి వడ్డీ రేట్ల కోత అంశంపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళనల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వరుసగా మూడో సెషన్‌లోనూ అక్కడి ప్రధాన ఇండెక్స్‌లు నష్టాలతోనే ముగిశాయి.

యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌(Trump) మరో బాంబ్‌ పేల్చాడు. ఫార్మాస్యూటికల్స్‌, ఫర్నిచర్‌, హెవీ ట్రక్‌ల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించారు.

దీంతో ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. టారిఫ్స్‌ ప్రభావంతో మన ఫార్మా స్టాక్స్‌ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News