అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Janu Lyri | ఫోక్ డ్యాన్సర్ folk dancer జాను లిరి janu lyri ఇక ట్రోలర్లను పట్టించుకోనని స్పష్టం చేసింది. ఇటీవల ఆమెపై పలువురు ట్రోలింగ్ చేయడంతో మనోవేదనకు గురైన జాను విలపిస్తూ తన ఇన్‌స్టా అకౌంట్లో శుక్రవారం వీడియోలు పెట్టింది. తనుకు చనిపోవాలని ఉందని ఏడుస్తూ చెప్పింది. తన గురించి చెడు ప్రచారం చేయొద్దని కోరింది. తర్వాత ఆ వీడియోలను డిలీట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన జాను మళ్లీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇక తాను ట్రోలర్లను పట్టించుకోనని తెలిపింది.
తాను రెండో పెళ్లి second marriage చేసుకుంటానని, పెళ్లితోనే తాను అందరికీ సమాధానం చెబుతానని స్పష్టం చేసింది. పెళ్లి తరువాత తన కొడుకుతో సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తన పెళ్లితో ట్రోలింగ్ చేసే వారికి వచ్చిన బాధ ఏమిటని ఆమె ప్రశ్నించింది. తాను నిన్న చేసిన వీడియోతో బాధ పడిన వారికి సారి చెప్పింది ఈ డ్యాన్సర్. ట్రోల్స్ కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, లైఫ్‌లో ఇంకా స్ట్రాంగ్ ఉంటానని తెలిపింది. తాను ఎవరికి భయపడనని, అయితే ట్రోలింగ్‌తో తన కుటుంబం ఏమి అనుకుంటుందోననే డిప్రెషన్‌లోకి వెళ్లి నిన్నటి వీడియో పెట్టినట్లు స్పష్టం చేసింది.
View this post on Instagram