- Advertisement -
Homeతెలంగాణlocal body elections reservation | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.. ఎస్సీ,...

local body elections reservation | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్లు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: local body elections reservation | గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్​ల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.

రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని తెలంగాణలోని రేవంత్​ సర్కారు నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

కానీ, రిజర్వేషన్లు 50​ శాతం దాటొద్దనే సుప్రీంకోర్టు Supreme Court ఉత్తర్వుల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్​ అమలు తీరుపై సందేహాలు నెలకొన్నాయి.

local body elections reservation | 69 శాతం రిజర్వేషన్లు

కాగా, రిజర్వేషన్లపై మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి Chief Minister Revanth Reddy క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

దీంతోపాటు ఎస్సీ SC, ఎస్టీ ST లకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు. మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News