- Advertisement -
HomeతెలంగాణTGS RTC | ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. రూ. 5.50 లక్షల బహుమతి మరచిపోకండీ!

TGS RTC | ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. రూ. 5.50 లక్షల బహుమతి మరచిపోకండీ!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | దసరా సెలవులు Dussehra holidays వచ్చేశాయి. ఆయా దూర ప్రాంతాల నుంచి తమ ఇంటికి చేరుకునేవారు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.

ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో అధికంగా passengers ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ తమ ప్రయాణికులను ప్రోత్సహించేందుకు బంపర్​ ఆఫర్​ ప్రకటించింది.

- Advertisement -

లక్కీ డ్రాలో గెలుపొందే వారికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయబోతోంది. రీజియన్​కి ముగ్గురు చొప్పున మొత్తం 33 మంది ప్రయాణికులను ఎంపిక చేసి, వారికి రూ.5.50 లక్షల నగదు బహుమతులు అందజేయనుంది.

TGS RTC | నగదు బహుమతితోపాటు సత్కారం..

TGS RTC | ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. రూ. 5.50 లక్షల బహుమతి మరచిపోకండీ!
TGS RTC | ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా.. రూ. 5.50 లక్షల బహుమతి మరచిపోకండీ!

లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతితో పాటు ఘనంగా సన్మానం ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ TGSRTC MD VC Sajjanar తెలిపారు.

ఈమేరకు దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. లక్కీ డ్రాకు సంబంధించి ఇతర వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 ను సంప్రదించాలని, స్థానిక డిపో మేనేజర్లను కూడా సంప్రదిస్తే.. వివరాలు తెలుపుతారని చెప్పారు.

నగదు బహుమతి ఇలా..

  • ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు
  • ద్వితీయ బహుమతి రూ. 15 వేలు
  • తృతీయ బహుమతి రూ.10 వేలు

ప్రయాణ కాలం..

ఈ నెల (సెప్టెంబరు) 27వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు టీజీఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారికి ఈ అవకాశం ఉంటుంది.

ఏఏ బస్సులు అంటే..

లహరి, సూపర్​ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్, సెమీ డీలక్స్ తోపాటు అన్ని రకాల ఏసీ బస్సులు.

కాంటెస్ట్​లో పాల్గొనాలంటే..

ఆయా బస్సుల్లో ప్రయాణం అనంతరం టికెట్​ వెనుకాల పేరు, కాంటాక్ట్ నంబరు రాయాలి. తర్వాత ఆ టికెట్​ను బస్టాండులో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా డబ్బాలో వేయాలి.

డ్రా ఎప్పుడు తీస్తారంటే..

అక్టోబరు 6వ తేదీ తర్వాత డ్రాప్ పెట్టెలను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చుతారు. అక్కడ లక్కీ డ్రా తీస్తారు. ఈ తంతు రీజియన్​ కార్యాలయాల వారీగా ఉంటుంది. అక్టోబరు 8వ తేదీన రీజియన్​ల వారీగా ముగ్గురి చొప్పున విజేతలను ప్రకటిస్తారు.

TGS RTC | దసరా సందర్భంగా 7754 ప్రత్యేక బస్సులు..

దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.  ప్రయాణికులకు జర్నీ ఇబ్బందులు తలెత్తకుండా 7754 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News