- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Task Force Police | పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

Task Force Police | పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Task Force Police | పేకాట స్థావరాలపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు గురువారం దాడులు చేశారు. 16 మందిని అరెస్ట్​ చేశారు.

సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు టాస్క్​ఫోర్స్​ ఇన్​ఛార్జి ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీసీఎస్​ ఎస్సై గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేశారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి ఏడుగురిని అరెస్ట్​ చేశారు. వారి నుంచి ఏడు ఫోన్లు, రూ.13,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అదే గ్రామంలోని మరోచోట పేకాట స్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 ఫోన్లు, రూ.11,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని తదుపరి చర్యలు నిమిత్తం వర్ని ఎస్​హెచ్​వో (Varni SHO)కు అప్పగించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News