అక్షరటుడే, నిజాంసాగర్: అక్రమంగా ఇసుక(Sand)ను తరలిస్తున్న టిప్పర్‌ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) పట్టుకున్నారు. మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని నర్వ గేటు(Narva Gate) వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై(SI) హెచ్చరించారు.
