అక్షరటుడే, ఇందూరు: Indian women’s team coach : ఇటీవల లివర్పూల్(ఇంగ్లాండు) Liverpool (England) లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ World Boxing Championships లో భారత మహిళా జట్టుకు ఎత్తేసాముద్దీన్ కోచ్‌గా వ్యవహరించారు.
ఇందులో భారత్ బాక్సర్లు రెండు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు, ఒకటి కాంస్య పతకం సాధించారు.
నిజామాబాద్‌కు చెందిన ఎత్తేసాముద్దీన్ నేతృత్వంలో భారత క్రీడాకారులు ప్రపంచ వేదికపై సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కోచ్‌కు నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ పక్షాన కలెక్టరేట్ Collectorate మైదానంలో ఘనంగా సన్మానించారు.
Indian women’s team coach : ఇంటి స్థలం కేటాయించాలి..
ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ మాట్లాడారు. చిన్న వయసులోనే భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం చాలా గర్వకారణం అని పేర్కొన్నారు.
ఎత్తేసాముద్దీన్ ఆధ్వర్యంలో భారత్ బాక్సర్లు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎత్తేసాముద్దీన్ ద్రోణాచార్య అవార్డు సాధించాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ Olympic ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ ఎత్తేసాముద్దీన్కు ప్రభుత్వం 350 గజాల ఇంటి స్థలం కేటాయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ సంసాముద్దీన్ , స్విమ్మింగ్ కోచ్ ఫారుక్, సీనియర్ అథ్లెట్ కైసర్, యాసిన్, యాకూబ్ పాల్గొన్నారు.