అక్షరటుడే, బీర్కూర్: Farmers | యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో (paddy purchase center) విక్రయించిన ధాన్యానికి వెంటనే బోనస్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దామరంచ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహాజన సభ (Mahajana Sabha) నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఋణమాఫీ పొందని రైతు సభ్యులకు ఏకకాలంలో ఋణ మాఫీ వచ్చేలా చూడాలని తీర్మానం చేశారు. బోనస్ రాకపోవడంతో రైతులు (Farmers) అప్పులు చేసి ఖరీఫ్ సాగు చేస్తున్నారని వాపోయారు. వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.